జ్యోతిషం ప్రకారం తెలంగాణలో ఎన్నికలు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు...

By SumaBala BukkaFirst Published Nov 30, 2022, 7:22 AM IST
Highlights

తెలంగాణలో జ్యోతిషం ప్రకారం ఎన్నికలు వస్తాయంటూ సుప్రీంకోర్టు  న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ తెలంగాణలో ఎన్నికల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు వస్తాయని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాఖలైన పిటిషన్ పై విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పీడీ యాక్ట్ మీద అరెస్టైన రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని, టిఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. 

ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫు వాదిస్తున్న న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇది 2018 ఎన్నికల నాటి నోటిఫికేషన్ అని పేర్కొన్నారు. దీనిమీద  మరికొన్ని వివరాలు సమర్పించాలంటే తమకు మూడు వారాల టైం కావాలని అన్నారు. ఈ మేరకు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.  ఈ దశలో జస్టిస్ వి, రామ సుబ్రమణియన్ జోక్యం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..  ‘ 2018లో తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి. అది జ్యోతిష్యం ప్రకారం జరిగింది. దానిలాగే  ఈ కేసు విచారణ కోసం గ్రహాలన్నీ  కూడా ఒకే వరుసలోకి రావాలేమో’.. అంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఈ కేసు విచారణను జనవరికి వాయిదా వేశారు. 

‘సోది క్లాస్’ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన విద్యార్థిని.. ఆ లెక్చరర్ రియాక్షన్ తో కథ రివర్స్..

ఇదిలా ఉండగా, నవంబర్ 17న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనితీరు మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ ఆకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోయింది. దీంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీకి ఓ లెటర్ రాశారు. తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ రిపేర్లకు వస్తుందని.. దానిని మార్చాలి అంటూ కోరారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారు. తన భద్రతకు ముప్పు ఉందని.. కొత్త వాహనం ఇవ్వడానికి కేటీఆర్ అనుమతి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లేకపోతే వారికి తెలియకుండా అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని కూడా ప్రశ్నించారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చలేకపోతే.. తనకు కేటాయించిన ఈ వాహనాన్ని తిరిగి తీసుకోవాలని.. ఇంత పాత బండిని తాను వాడలేనని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు. 

click me!