కృష్ణా ట్రిబ్యునల్:తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణకు సుప్రీం అనుమతి

By narsimha lodeFirst Published Oct 6, 2021, 6:07 PM IST
Highlights

కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.అయితే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి.దీంతో ఈ రాష్ట్రాల అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది.

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఉప సంహరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.krishna water  పంపకంపై తెలంగాణ గతంలో కొత్త tribunal ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను ఉప సంహరించుకొంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది.

also read:కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ: నీటి విడుదల.. శ్రీశైలం, పోతిరెడ్డిపై మరోసారి ఫిర్యాదు

సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ ను ఉప సంహరణకు సుప్రీంకోర్టును telangana ప్రభుత్వం అనుమతి కోరింది.దీంతో ఈ పిటిషన్ ను  ఉప సంహరించుకొనేందుకు సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది.

ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి.మరో వైపు ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల అభ్యంతర పిటిషన్లను దాఖలు చేయడానికి అనుమతించింది.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత కృష్ణా జలాల పున: పంపిణీ జరగాలని టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేసింది.ఈ విషయమై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

కృష్ణా జలాలతో పాటు, గోదావరి నది జలాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకొన్నారు.


 

click me!