తెలుగు అకాడమీ స్మామ్: ఏసీవో రమేష్ తో కలిసి ప్లాన్, సంచలన విషయాలు వెల్లడి

By Siva KodatiFirst Published Oct 6, 2021, 3:48 PM IST
Highlights

తెలుగు అకాడమీ (telugu academy scam) నిధుల గోల్‌మాల్‌లో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితమే డబ్బును కొట్టేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నిందని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్‌తో (ramesh) కలిసి వీరు ప్లాన్ వేశారని పోలీసులు తెలిపారు

తెలుగు అకాడమీ (telugu academy scam) నిధుల గోల్‌మాల్‌లో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితమే డబ్బును కొట్టేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నిందని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేశ్‌తో (ramesh) కలిసి వీరు ప్లాన్ వేశారని పోలీసులు తెలిపారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లు వేయాలని సిఫారసు చేశారు. అయితే బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే సమయంలోనే నకిలీ పత్రాలను సిద్ధం  చేసిన ఈ ముఠా.. డైరెక్టర్,(director) అకౌంట్ ఆఫీసర్ (accounts officer) సంతకాలు ఫోర్జరీ చేసింది. 

ఏడాది కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. అలాగే ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు (deposits) తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. అనంతరం ఒరిజినల్ ఎఫ్‌డీలతో రూ.64.5 కోట్లు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతాను తెరిచారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలను సృష్టించారు. అనంతరం యూనియన్ (union bank), కెనరా బ్యాంకుల్లో (canera bank) కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్‌కు (agrasen bank) ఆ తర్వాత ఏపీ మర్కంటైల్ సొసైటీకి (ap mercantile cooperative bank) మళ్లించారు. ఆపై మర్కంటైల్‌లో రూ.64. కోట్లు డ్రా చేసి కొట్టేసింది ఈ గ్యాంగ్. ఇందుకోసం రూ.6 కోట్లను బ్యాంక్ మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచమిచ్చారు. అలాగే అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కి సైతం రూ.కోట్లలో ముడుపులు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెట్టారు  నిందితులు. 

ALso Read:తెలుగు అకాడమీ స్కామ్ నిందితులు వీరే :రూ.324 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్

కాగా, తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలుగు అకాడమీలో సుమారు . రూ. 324 కోట్ల నిధులను డ్రా చేయాలని ముఠా సభ్యులు ప్లాన్ చేశారని ccs పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడు మస్తాన్ వలీ (యూనియన్ బ్యాంక్ మేనేజర్), ఏ2 రాజ్ కుమార్ (ఏజెంట్), ఏ3 సత్యనారాయణ రాజు (ఏపీ మర్కంటైల్ బ్యాంక్),  ఏ4 పద్మావతి (మర్కంటైల్ బ్యాంక్), ఏ5 మొయినుద్దీన్ (మర్కంటైల్ బ్యాంక్, ఏ6 చందురి వెంకటసాయి (ఏజెంట్), ఏ7 నందురి వెంకట (ఏజెంట్), ఏ8 వెంకటేశ్వర రావు (ఏజెంట్), ఏ9 రమేష్ (తెలుగు అకాడమీ ఏసీవో), ఏ10 సదన (కెనరా బ్యాంక్)
 

click me!