సంగారెడ్డి జిల్లాలో తుపాకీ కలకలం: మాజీ సర్పంచ్ రవి హత్యకు కుట్ర?

Published : Apr 06, 2022, 10:45 AM ISTUpdated : Apr 06, 2022, 05:08 PM IST
సంగారెడ్డి  జిల్లాలో తుపాకీ కలకలం:  మాజీ సర్పంచ్  రవి హత్యకు కుట్ర?

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్  మండలంలో తుపాకీతో తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. వీరి నుండి ఐదు బుల్లెట్లు, సిమ్ కార్డును సీజ్ చేశారు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా Ameenpurమండలంలో Pistol కలకలం చోటు చేసుకొంది.  తుపాకీతో తిరుగుతున్న ఇద్దరిని  గుర్తించిన స్థానికులు పోలీసులకు  సమాచారం ఇచ్చారు.ఈ ఇద్దరిని Police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే మాజీ సర్పంచ్ ఇస్లావత్ రవిని చంపేందుకు నిందితులు తుపాకీతో తిరుగుతున్నారని పోలీసులు గుర్తించారు.

అమీన్‌పూర్ మండలం Ilapur వద్ద తుపాకీతో ఇద్దరు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు.ఈ ఇద్దరిని గుర్తించిన స్థానికులు వారిని చితకబాది  సమాచారం ఇవ్వడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  వీరి నుండి ఐదు బుల్లెట్లతో పాటు సిమ్ కార్డు నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మాజీ సర్పంచ్ ఇస్లావత్ రవిని హత్య చేసేందుకు తాము తిరుగుతున్నట్టుగా నిందితులు గ్రామస్తులకు చెప్పారు. అయితే తన హత్యకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సుఫారీ ఇచ్చారని రవి ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై పోలీసులు ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే తమ స్థలంలో సర్పంచ్ రవి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న విషయమై ఫోటోలు తీసేందుకు వచ్చిన ఇద్దరిపై గ్రామస్తులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిపై దాడి చేశారన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. ఇద్దరు సోదరులపై దాడికి పాల్పడిన కేసులో మాజీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్