Kumari Aunty: ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కుమారి ఆంటీకు కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయనీ, దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చిచెప్పేశారు. ఇలా చేయడం అన్యాయమంటూ.. పలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Kumari Aunty: ఇటీవల సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోన్న పేరు కుమారీ ఆంటీ.. ఆమె ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత 13 ఏండ్లుగా తక్కువ ధరకే మంచి భోజనాన్ని అందిస్తూ.. తన బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. కానీ, ఇటీవల మీమర్స్ వల్ల ఆవిడ రీల్స్, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా .. అమ్మా మీది బిల్ థౌంజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పే వీడియో మాత్రం తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే.. ఆమెను ఇంటర్య్వూ చేయడానికి తెగ క్యూ కట్టారు. అలాగే.. మీడియా కూడా ఆవిడ మీద ఫోకస్ పెట్టేలా పెట్టిందంటూ అతిశయోక్తి కాదు.
ఇలా కుమారీ ఆంటీ వీడియోలు ట్రోల్స్ కావడంతో గతంతో పోలిస్తే ఇటీవల ఆమె బిజినెస్ రెండింతలు అయ్యిందనీ, గతంలో 300 ప్లేట్లు అమ్మితే.. ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తోందనీ.. అలాగే కుమారి ఆంటీ నెల టర్నోవర్ ఏకంగా రూ.18 లక్షలు అంట తెగ ప్రచారం జరిగింది. అంతేకాదు.. బిగ్‌బాస్ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీడియోలు చేశాయి. ఈ మధ్య హీరో సందీప్ కిషన్ సైతం కుమార్ ఆంటీ పుడ్ కోర్టు వద్దకు వెళ్లి తన సినిమా ఊరి పేరు భైరవకోన ప్రమోషన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా కూడా కుమారి ఆంటీ యూట్యూబ్, ఇస్టాగ్రాం, ఫేస్బుక్ మొదలైన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో కుమారీ ఆంటీ తెగ ఫేమస్ అయ్యింది.
అయితే ఈ పాపులార్టే కుమారీ ఆంటీని కష్టాల్లోకి నెట్టిసింది. ఈవిడ దగ్గర భోజనం చేసేందుకు యువత బారులు దీరుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆమె బిజినెస్ చేసే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని కుమారి ఆంటీకి తేల్చిచెప్పేశారు. ఈ క్రమంలో ఆమెకు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది.
ఇదంతా కేవలం సోషల్ మీడియా వలనే జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా..మరికొందరూ మాత్రం ఇలా చేయడం అన్యాయమంటూ ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై హీరో సందీప్ కిషన్ స్పందించాడు. ఆయన ట్విట్టర్ వేదికగా కుమారి ఆంటీ కి మద్దతు తెలిపారు. ఆమెకు అండగా నిలుస్తూ.. పోలీసులు ఇలా చేయడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. “ఇది చాలా చాలా అన్యాయం.. చాలా మంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె ప్రేరణగా నిలిచారు. ఇలా పలువురికి ప్రేరణగా నిలిచే ఆమెకు ఇలా చేయడం అన్యాయం. ఈ మధ్యకాలంలో నేను చూసిన సాధికారత ఉన్న మహిళల్లో ఈమె ఒకరు. నేను, నా టీమ్ ఆమెకు సపోర్ట్ గా ఉంటాం. మేము చేయగలిగినంత వరకు ఆమెకు ఏమైనా చేస్తాం.. ” అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.