కోర్టులకు వేసవి సెలవులు రద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

By narsimha lodeFirst Published Apr 29, 2020, 3:28 PM IST
Highlights

రాష్ట్రంలోని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

హైదరాబాద్:రాష్ట్రంలోని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్లకు కూడ సెలవులను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.

లాక్ డౌన్ నేపథ్యంలో  వీడియా కాన్పరెన్స్ ద్వారానే పుల్ కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొన్నారు. మే నుండి జూన్ 5 వరకు వేసవి సెలవరులను రద్దు చేస్తున్నట్టుగా పుల్ కోర్టు నిర్ణయం తీసుకొంది. 

సెలవులను రద్దు చేసిన నేపథ్యంలో కోర్టును ఓపెన్ చేస్తే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పుల్ కోర్టు అభిప్రాయపడింది. దరిమిలా అత్యవసరమైన  కేసులను ప్రస్తుతం అనుసరిస్తున్నట్టుగా వీడియో కాన్పరెన్స్ పద్దతిలో విచారణ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

అత్యవసర బెయిల్, స్టే పిటిషన్లతో పాటు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకొంది హైకోర్టు. లాక్ డౌన్ నేపథ్యంలో వీడియో కాన్పరెన్స్ ద్వారానే హైకోర్టులో కేసుల విచారణలు సాగుతున్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 27 నుండి అత్యవసర పిటిషన్లను వీడియో కాన్పరెన్స్ ద్వారానే విచారణ చేస్తుంది హైకోర్టు. ఇతర కోర్టు కార్యకాలాపాలు కొనసాగించడం లేదు. 
 

click me!