విద్యార్థులకు శుభవార్త.. నేటీ నుంచి వేసవి సెలవులు..

Published : Apr 12, 2023, 12:53 PM IST
విద్యార్థులకు శుభవార్త.. నేటీ నుంచి వేసవి సెలవులు..

సారాంశం

SUMMER HOLIDAYS: పదవ తరగతి ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగియడంతో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. 

SUMMER HOLIDAYS: ఇప్పటికే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. వారికి వేసవి సెలవులు కూడా ప్రకటించారు. ఇక తెలంగాణలో  పదో తరగతి పరీక్షలు  ఏప్రిల్ 03 నుంచి ప్రారంభం కాగా.. ఏప్రిల్ 11తో  ముగిశాయి. అయితే.. 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ సబ్జెక్టులకు పరీక్షలు రాసే వారి సంఖ్య చాలా తక్కువ. అయితే.. పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగియడంతో..విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. వారిని నేటీ నుంచి వారికి వేసవి సెలవులను ప్రకటించారు. 

ఇక..పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నుంచి ప్రారంభంకానన్నట్లు సమాచారం. ఈ ఏడాది  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 6 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో 12 కేంద్రాలు ఉండగా.. కొత్తగా 6 ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య 18 కి చేరింది. ఈ సారి కొత్తగా సిద్దిపేట, మంచిర్యాల, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మే 10 తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక వేసవి సెలవుల్లో నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు మార్గదర్శకాలను జారీ చేశారు. వేసవిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. 

ఇరు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కావడంతో  అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఒంటి పూటనే బడులు నడుస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే హాఫ్ డే స్కూళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే.. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 24 లో పరీక్షలు నిర్వహించి.. ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ పాఠశాల ఉపాధ్యాయులకు ఆదేశించింది. అనంతరం ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించింది విద్యాశాఖ . 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?