ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహిశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: ఎఐసీసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం బుధవారంనాడు షోకాజ్ నోటీస్ పంపింది. ఈ షోకాజ్ నోటీస్ ఆధారంగా క్రమశిక్షణ సంఘం నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం నోటీసు పంపింది. గంటలోపుగా వివరణ ఇవ్వాలని నోటీస్ జారీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా నుండి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేను మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఠాక్రే తీరుపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇదే జిల్లా నుండి గత మాసంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతుంది.