ఓఆర్ఆర్ వద్ద ఐదు మృతదేహాలు

Published : Oct 17, 2017, 10:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఓఆర్ఆర్ వద్ద ఐదు మృతదేహాలు

సారాంశం

ఓఆర్ఆర్ వద్ద ఐదుగురు మృతదేహాలు సంచలనంగా మారింది. కొల్లూరు గ్రామం వద్ద స్ధానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అందరూ హైదరాబాద్ వారుగానే అనుమానిస్తున్నారు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐదు మృతదేహాలు సంచలనంగా మారింది. ఓఆర్ఆర్ కు సమీపంలోని రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామం వద్ద ఉదయం ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను స్ధానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇపుడదో పెద్ద సంచలనమైంది. మృతులందరూ హైదరాబాద్ కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఐదుగురు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకోవటంతో అధునాతనంగానే కనిపిస్తున్నారు.

ఇప్పటి వరకు వీరిని స్ధానికులు ఎవరూ గుర్తించలేదు. కాబట్టి వారు ఆ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. కాకపోతే ఎక్కడైనా హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసారా? లేకపోతే వారే ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : బంగాళాఖాతంలో తుపాను.. ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవా?
బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!