ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ఘటనలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఎవ్వరికీ భారం కాదల్చుకోలేదని .. తాను కోరుకున్న జీవితం ఇది కాదని ప్రత్యూష లేఖలో పేర్కొన్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు వున్నారు. ఈ క్రమంలో ప్రత్యూష గదిలో సూసైడ్ నోట్ లభించింది. ‘‘తాను కోరుకున్న జీవితం ఇది కాదని.. ఇకపై తల్లిదండ్రులకు భారం కాలేను, క్షమించండి’’ అంటూ ప్రత్యూష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తాను స్వేచ్చను కోరుకున్నానని.. తాను ఎవ్వరికీ భారం కాదల్చుకోలేదని ప్రత్యూష పేర్కొన్నారు. డిప్రెషన్ నుంచి అనేక సార్లు బయటకు రావాలని ప్రయత్నించానని.. ప్రతిరోజూ తాను బాధపడుతూనే వున్నానని ఆమె లేఖలో ప్రస్తావించారు.
కాగా.. భారతదేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు. స్టీమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ కలుపుకుని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాత్రూమ్లో బొగ్గులతో పొగ వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
undefined
ALso Read:హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య
రెండు రోజులుగా ప్రత్యూష బయటకు రాకపోవడంతో రెసిడెన్సీ వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో వాచ్ మన్ తలుపులు తట్టాడు. అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులకు శనివారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రత్యూష శవం బాత్రూంలో పడి ఉండగా.. ఆమె శవం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పడి ఉంది. ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రత్యూష హైదరాబాదుకు వచ్చి ఇక్కడై స్థిరపడింది. పదేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం పనిచేస్తూ వస్తోంది. ఇండియాలోనే ప్రముఖ డిజైనర్ గా ఆమె పేరు సంపాదించుకుంది. 39 ఏళ్ల ప్రత్యూష గరిమెళ్ల ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆమె డిప్రెషన్ కు గురి కావడానికి గల కారణమేమిటనేది చెప్పలేకపోతున్నారు.
సినీ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణితి చోప్రా, మాధురీ దీక్షిత్, కాజోల్, విద్యా బాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శ్రుతి హాసన్, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, క్రుతి కర్బంద వంటివారికి ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యూష గరిమెళ్ల పనిచేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా ఆమె పనిచేశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆమెకు బోటిక్ ఉన్నట్లు తెలుస్తోంది