హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య

By Siva Kodati  |  First Published Jun 11, 2022, 5:49 PM IST

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు


హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ లభించింది. భారతదేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు. స్టీమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ కలుపుకుని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాత్‌రూమ్‌లో బొగ్గులతో పొగ వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

రెండు రోజులుగా ప్రత్యూష బయటకు రాకపోవడంతో రెసిడెన్సీ వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో వాచ్ మన్ తలుపులు తట్టాడు. అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులకు శనివారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రత్యూష శవం బాత్రూంలో పడి ఉండడాన్ని, ఆమె శవం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పడి ఉంది. ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీలు ఆరా తీస్తున్నారు.

Latest Videos

undefined

అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రత్యూష హైదరాబాదుకు వచ్చి ఇక్కడై స్థిరపడింది. పదేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం పనిచేస్తూ వస్తోంది. ఇండియాలోనే ప్రముఖ డిజైనర్ గా ఆమె పేరు సంపాదించుకుంది. ప్రత్యూష ఏమైనా సూసైడ్ లెటర్ రాసిందా అనేది కనుక్కోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె మొబైల్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు.

39 ఏళ్ల ప్రత్యూష గరిమెళ్ల ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆమె డిప్రెషన్ కు గురి కావడానికి గల కారణమేమిటనేది చెప్పలేకపోతున్నారు. స్టీమ్ లో కార్బన్ మోనాక్సైడ్ కలువుకుని ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. వారు ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. ఆమె శవాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 

click me!