రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

Published : Aug 26, 2022, 11:00 AM IST
రేపు వరంగల్ లో బీజేపీ సభ: అనుమతికై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

సారాంశం

రేపు వరంగల్ లో నిర్వహించే సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో బీజేపీ నేతలు శుక్రవారం నాడు హైకోర్టు తలుపు తట్టారు.ఈ సభకు అనుమతి కోసం బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

హైదరాబాద్: రేపు వరంగల్ లో నిర్వహించే సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో బీజేపీ నేతలు శుక్రవారం నాడు  తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో సభకు ప్లాన్ చేశారు. ఆర్ట్స్ కాలేజీలో సభకు బీజేపీ నేతలు అనుమతి కోసం ధరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆర్ట్స్ కాలేజీ  నుండి సభ నిర్వహణకు అభ్యంతరం తెలిపారు. ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో ఆర్ట్స్ కాలేజీ నుండి కూడా ఇదే రకమైన సమాచారం వచ్చింది.  దీంతో వరంగల్ పోలీస్ కార్యాలయం వద్ద గురువారం నాడు రాత్రి బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వరంగల్ సభకు పోలీసులు అనుతివ్వకపోవడంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేతలు.  రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ నిర్వహించనున్నారు. ఈ  సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?