మాకు తిండి తిప్పలు.. ఆయనకు వాస్తు బాధలు

First Published Nov 21, 2016, 9:45 AM IST
Highlights
  • ఫీజు రి యింబర్స్ మెంట్, మెస్ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం
  • వాస్తు పేరుతో రూ. కోట్ల ఖర్చు పెట్టి కొత్త ఇంటి నిర్మాణం
  • సీఎం కేసీఆర్ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు

బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఊదరగొట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటినా విద్యార్థుల బాధలను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో టీఎన్‌ఎస్‌ఎఫ్ సెక్రటేరియట్ వద్ద సోమవారం ధర్నా చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మధు మాట్లాడుతూ బకాయిల విడుదలకు ప్రభుత్వానికి ఈనెల 24వ తేదీ వరకు సమయం ఇస్తున్నామన్నారు.

 

మెస్ బకాయిల వల్ల విద్యార్థుల తిండి లేక పస్తులుంటుంటే  పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ వాస్తు పేరుతో తన ఇంటి నిర్మాణానికి కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.  

 

తాము ఇచ్చిన సమయంలోపు బకాయిలు చెల్లించకుంటే సీఎం కేసీఆర్ గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

click me!