మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం మగాళ్ళకు పీడకలను మిగిలిస్తోంది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టిసి బస్సుల్లో పరిస్థితిని అద్దంపట్టే ఘటన జగిత్యాలలో వెలుగుచూసింది.
జగిత్యాల : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ 'మహాలక్ష్మి' పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం మహిళలకు బాగానే వున్నా మగాళ్ళకు చుక్కలు చూపిస్తోంది. ఆర్టిసి బస్సుల్లో మహిళలు కిక్కిరిపోవడంతో అసలు పురుషులు బస్సెక్కడానికే భయపడిపోతున్నారు. ఇంతకుముందు ''స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం'' అనే సూచనలు వుండేవి కానీ ఇప్పుడు పురుషుల కోసం ఇలాంటి సూచనలు చేయాల్సి పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఆర్టిసి ప్రయాణం ఎలా వుందో తెలియజేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది. జగిత్యాల పట్టణం నుండి పెగడపల్లికి వెళ్లే పల్లెవెలుగు మొత్తం మహిళలతో నిండిపోయింది. దీంతో కొందరు కాలేజీ యువకులు బస్సు వెనకాల వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇలా కాంగ్రెస్ సర్కార్ ఉచిత బస్సు ప్రయాణ హామీ మగాళ్లకు కష్టాలు తెచ్చిపెట్టింది.
వీడియో