దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు విద్యార్థి సంజయ్ ని కాలేజ్ బిల్డింగ్ నుంచి తోటి విద్యుర్థులు తోసేశారు. సంజయ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. నర్సంపేట బిట్స్ (Bits College)కాలేజీలో నలుగురు విద్యార్థుల మధ్య ఘర్షణ (Fighting) ఒకరి ప్రాణం బలి (murder) తీసుకుంది. నలుగురు విద్యార్థుల మధ్య అర్థరాత్రి వరకు ఘర్షణ జరిగింది. చిన్న వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీసింది.
దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు విద్యార్థి సంజయ్ ని కాలేజ్ బిల్డింగ్ నుంచి తోటి విద్యుర్థులు తోసేశారు. సంజయ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంజయ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చనిపోయిన విద్యార్థిని నకీర్తి సంజయ్ గా గుర్తించారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.