
గురకుల నోటిఫికేషన్ కు సంబంధించి టీఎస్ పీయస్సీ తీసుకొచ్చిన నిబంధనలు అభ్యర్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలపై అభ్యర్థులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తూ రేపు యూనివర్సిటీల బంద్ కు ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఐక్య విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్ లు ఇవే...
గురుకుల నోటిఫికేషన్ లోని అర్హతలు సవరించకుంటే సిఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభన్ ను ముట్టడిస్తాం.
B.com, మైక్రోబైయాలజి, B.Ed చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.
డిగ్రీ& పిజీల్లో 60%ప్రతిపాదన విరమించుకోవాలి
B.Ed, టెట్ అర్హత ఉన్న ప్రతివారికి అవకాశం ఇవ్వాలి.
ఆఫ్ లైన్ లోపరీక్షనిర్వహించాలి
పిజిటి వారికి 3 సంవత్సరాల అనుభాన్ని ఎత్తి వేయాలి
తెలుగు మరియు ఆంగ్లమాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి.
ప్రిపరెషన్ కు కనీసం ఆరునెలల గడువు ఇవ్వాలి.
డిఎస్సీ2012 అర్హతల్నే అమలు చేయాలి.
వికలాంగ అభ్యర్థుల కు రిజర్వేషన్లు పాటించి న్యాయం చేయాలి.
బాలికల పాఠశాలల్లో కూడా పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.
టెట్ ను అర్హత గా భావించి ప్రిలిమ్స్ ను ఎత్తివేయాలి.