
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరలో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉంది. ఓయూ ను స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 26,27,28 వ తేదీలలో వర్సిటీలో భారీస్థాయిలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతిని ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ కోరారు. ఈ రోజు ఆయన పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కేశవ్ రావ్, సీతారాం నాయక్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలసి రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ను కలిశారు.
ఓయూ ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ప్రణబ్ దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.