కెనడాలో చదువుతున్న విద్యార్థి నగరంలో ఆత్మహత్య.. ఫోన్ లోకాల్ డేటా, ఇతర సమాచారం తొలగించి మరీ...

Published : Feb 03, 2022, 10:40 AM IST
కెనడాలో చదువుతున్న విద్యార్థి నగరంలో ఆత్మహత్య..  ఫోన్ లోకాల్ డేటా, ఇతర సమాచారం తొలగించి మరీ...

సారాంశం

తల్లిదండ్రులు రెండురోజుల క్రితం వరంగల్లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి వారు కుమారుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో బయలుదేరి నగరానికి వచ్చారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపు లోపల గడియపెట్టి ఉండడంతో వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. సోహన్ బెడ్ రూమ్ లో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు.   

మూసాపేట : విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఓ student నగరంలో suicide చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అతను వచ్చేనెల తిరిగి వెళ్లాలి. ఏమైందో తెలియదు కానీ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. Kookatpalli Police Station పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
 
వరంగల్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త  శ్రీనివాస్, భార్గవి దంపతులు  కూకట్పల్లి వివేకానందనగర్ లో ఉంటున్నారు.  శ్రీనివాస్ వ్యాపార నిర్వహణతో పాటు వరంగల్ లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నాడు. వీరికి  బత్తిని సొహాన్ సిద్ధా (20) ఏకైక సంతానం. కెనడాలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. corona virus కారణంగా ఏడాది క్రితం ఇంటికి వచ్చిన సోహన్ నగరంలోనే వుంటూ Online classesకు హాజరవుతున్నాడు.

తల్లిదండ్రులు రెండురోజుల క్రితం వరంగల్లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి వారు కుమారుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో బయలుదేరి నగరానికి వచ్చారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపు లోపల గడియపెట్టి ఉండడంతో వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. సోహన్ బెడ్ రూమ్ లో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. 

అతని ఆత్మహత్యకు ముందు తన ఫోన్ లోని కాల్ డేటాతో పాటు, ఇతర సమాచారం తొలగించి ఉందని పోలీసులు గుర్తించారు. సొహాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేకనా లేదా ఇక్కడ ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఎస్సై శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, బుధవారంనాడు Mechanical Engineering విద్యార్థి suicide పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని Thadepalligudem మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో గతనెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజనీరింగ్  ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెనికి  చెందిన రవితేజ టెక్కలిలో డిప్లమా పూర్తిచేశాడు. 

ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి pain లేకుండా చనిపోవడం ఎలా అంటూ తోటి విద్యార్థులతో చర్చించాడు.  సోమవారం ఉదయం నలతగా ఉండడంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్ లోనే ఉండి పోయాడు. అదే రూమ్ లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారి తరగతులకు హాజరయ్యారు.

మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచరమిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురు సెల్ఫోన్లకు ‘మీకు సర్ ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ  Text messageను రవితేజ పోస్ట్ చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్ లోనే ఉన్నాడు అని చెప్పారు.  వెంటనే మిగతా విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు.

 రెండు వైపులా తలుపులు వేసి ఉండడంతో విద్యార్థులు రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్ కు నైలాన్‌ తాడుతో ఉరి వేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రవితేజ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి.రవికుమార్, ఎస్ఐ ఎం శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu