బండి సంజయ్ అరెస్ట్: పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు కరీంనగర్ సీపీ

By narsimha lodeFirst Published Feb 3, 2022, 9:51 AM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్  వ్యవహరంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు కరీంనగర్ సీపీ సత్యనారాయణ గురువారం నాడు హాజరు కానున్నారు. 


న్యూఢి్ల్లీ: BJP  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay అరెస్ట్ వ్యవహరానికి సంబంధించి  parliamentary privileges committee కమిటీ  Karimnagar సీపీ Satyanarayana సహా మరికొందరు పోలీస్ అధికారులను ప్రివిలేజ్ కమిటీ  గురువారం నాడు విచారించనుంది. అయితే ప్రివిలేజ్ కమిటీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు దూరంగా ఉన్నారు.

317 జీవోను నిరసిస్తూ  కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగాడు. అయితే ఈ దీక్షను కరీంనగర్ పోలీసులు భగ్నం చేశారు. Corona ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారని బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బండి సంజయ్ ఫిర్యాదు చేశాడు. 

దీంతో గత నెల 28న  ప్రివిలేజ్ కమిటీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‌తో సమావేశమై వివరాలను సేకరించింది. కరీంనగర్ సీపీ సత్యనారాయణతో పాటు కొందరు పోలీసు అధికారులు ఇప్పటికే పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావడానికి ఢిల్లీకి చేరుకొన్నారు. 

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం సెక్రటరీలు మాత్రం ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాలేదు. రాష్ట్రంలో ప్రధాని Narendra Modi టూర్ ఉన్న నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీకి దూరంగా ఉన్నారని సమాచారం. ఇదే విషయమై ప్రివిలేజ్ కమిటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.karimnagar cp, bandi sanjay, bjp, satyanarayana, parliamentary privileges committee , chief secretary, dgp, home secretary, బండి సంజయ్, బీజేపీ, సత్యనారాయణ, కరీంనగర్ సీపీ, ప్రివిలేజ్ కమిటీ

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తన అరెస్ట్ వ్యవహరానికి సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై లోక్‌సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తన అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై  48 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని గత నెల 4వ తేదీన కేంద్ర హోశాఖను ఆదేశించారు.  దీంతో కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలకు నోటీసులు పంపింది.

తమ ముందు హాజరు కావాలని గత నెల 22 వ తేదీన తెలంగాణ సీఎస్, డీజీపీ, హోం సెక్రటరీ, కరీంనగర్ సీపీ సహా ఇతర పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఈ నోటీసులకు అనుగుణంగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణకు కరీంనగర్ సీపీ సహా ఇతర పోలీసులు హాజరయ్యారు. 

 

click me!