హైదరాబాద్‌లో దారుణం : స్కూల్‌లో ఆడుకుంటుండగా విద్యార్ధికి కరెంట్ షాక్.. 50 శాతం కాలిపోయిన శరీరం

Siva Kodati |  
Published : Jun 30, 2023, 03:46 PM IST
హైదరాబాద్‌లో దారుణం : స్కూల్‌లో ఆడుకుంటుండగా విద్యార్ధికి కరెంట్ షాక్.. 50 శాతం కాలిపోయిన శరీరం

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మెరీడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి. ఆ విద్యార్ధికి దాదాపు 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లుగా సమాచారం.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మెరీడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం జరిగింది. లంచ్ టైంలో ఆడుకుంటున్న విద్యార్ధికి కరెంట్ షాక్ తగిలింది. ప్రహరీకి వున్న విద్యుత్ ఫెన్సింగ్ తగలడంతో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్ధిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

గాయపడిన విద్యార్ధిని హసన్‌గా గుర్తించారు. ఇతను స్కూల్‌లో 11 వ తరగతి చదువుకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో ఆడుకుంటూ వుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ విద్యార్ధికి దాదాపు 50 శాతం మేర శరీరం కాలిపోయినట్లుగా సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌కు సమీపంలో ఐరన్ రాడ్స్ వుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch
రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు