కొమరంభీమ్ ఆసిఫాబాద్: కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Jun 30, 2023, 2:52 PM IST

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నూతన  కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని  సీఎం కేసీఆర్  ఇవాళ ప్రారంభించారు. 


ఆసిఫాబాద్: కొమరంభీమ్  ఆసిఫాబాద్  నూతన  కలెక్టరేట్,  ఎస్పీ  కార్యాలయాలను  తెలంగాణ  సీఎం  కేసీఆర్  శుక్రవారంనాడు ప్రారంభించారు.  ఎస్పీ  కార్యాలయంలో  ప్రత్యేక పూజల్లో సీఎం  పాల్గొన్నారు.  ఆసిఫాబాద్  ఎస్పీ  సురేష్ ను  కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు  సీఎం కేసీఆర్.  అనంతరం  జిల్లా కలెక్టర్ నూతన  కార్యాలయ భవనాన్ని  సీఎం  కేసీఆర్  ప్రారంభించారు.  అంతకుముందు  పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్ స్వీకరించారు.

20 ఎకరాల్లో  రూ. 61 కోట్లతో  ఆసిఫాబాద్ నూతన  కలెక్టరేట్ ను  నిర్మించారు. ఈ కార్యాలయంలో  అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలుంటాయి.  అధికారుల  కోసం  ప్రత్యేకంగా  క్వార్టర్లను  ఏర్పాటు  చేశారు. కలెక్టరేట్ ను  జీ+2 అంతస్తుల్లో నిర్మించారు.  గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్స్  ఏర్పాటు  చేశారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో  31  ప్రభుత్వ  శాఖల కార్యాలయాలు కూడ ఏర్పాటు  చేశారు. 

Latest Videos

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన  కేసీఆర్

ఆసిఫాబాద్ చేరుకున్న వెంటనే  కొమరంభీమ్  విగ్రహనికి  సీఎం కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆసిఫాబాద్ లో  కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ నూతన  కార్యాలయాన్ని  కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పతాకాన్ని  కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో  ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 

 


 

click me!