
హైదరాబాద్ (hyderabad) మొయినాబాద్‌లో (moinabad) విషాదం చోటు చేసుకుంది. జేబీఐటీ కాలేజీ (jbit college) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలల క్రితమే జేబీఐటీ కళాశాలలో చేరిన గజ్జల విజయ్ భాస్కర్ (gajjala vijay bhaskar) అనే విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం కరీంనగర్ జిల్లా. అతని ఆత్మహత్యతో సహచర విద్యార్ధులు భగ్గుమన్నారు. కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.