Road Accident: షాద్ నగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఓవర్ స్పీడ్‌తో రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..

Published : Nov 20, 2021, 11:38 AM IST
Road Accident: షాద్ నగర్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఓవర్ స్పీడ్‌తో రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..

సారాంశం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌ (shad nagar) పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌ (shad nagar) పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. కొందుర్గు (Kondurg) మండల మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. షాద్ నగర్ నుంచి పరిగి వైపు వెళ్తున్న బొలెరా వాహనం..  పరిగి వైపు నుండి షాద్  నగర్ వస్తున్న టాటా ఏసీ వాహనం ఓవర్ స్పీడ్ తో ఒక దానికి మరొకటి ఢీకొన్నాయి (two vehicles collided). ఈ ఘటనలో వెంకటయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని చటాన్‌పల్లికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదంలో మరో ముగ్గురకి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వీరు వాహనంలోనే ఇరుక్కుపోయారు. వీరికి బయటకు తీసేందుకు రెండు గంటల పాటు శ్రమించిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. దీంతో చివరకు జేసీబీ సాయంతో వీరిని బయటకు తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఇందుకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. 

Also read: నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. మహిళ తల మీదినుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్..

కొత్తూరులో రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్లి వస్తూ అన్నా చెల్లెళ్ల మృతి..
రంగారెడ్డి జిల్లాలో కొత్తూరులో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసున్న ప్రమాదంలో అన్నాచెల్లళ్లు మృతి చెందారు. వీరు ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు.. మూసాపేట్ మండలం  కొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జటారం చంద్రశేఖర్(25) తన చెల్లి మద్దూరి మమత(24) తో ఖిల్లాఘనపురంలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారిపై బంకులోకి వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో.. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వీరిద్దరు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలోనే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మమతకు ఏడాది క్రితం నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మద్దూరి అమరేందర్ రెడ్డితో వివాహమైంది. ప్రమాదం విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి ఏఎస్సై అబ్దుల్లా చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వద్దనే తండ్రి తిమ్మారెడ్డి, తల్లి కల్లమ్మలు ఉంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు