నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. మహిళ తల మీదినుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్..

Published : Nov 20, 2021, 11:13 AM IST
నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. మహిళ తల మీదినుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్..

సారాంశం

నిధా రెహమాన్ ద్విచక్రవాహనం మీద వెడుతుండగా వెనకనుంచి వచ్చిన ట్యాంకర్ గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్ : నారాయణ గూడా పోలీస్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.  వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. Kanchan Bhag కు చెందిన నిధా రెహమాన్ (26) ను Tanker ఢీకొట్టింది. కిందపడిపోయిన నిధా రెహమాన్  తలపై నుంచి ట్యాంకర్ వెళ్ళడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. 

నిధా రెహమాన్ ద్విచక్రవాహనం మీద వెడుతుండగా వెనకనుంచి వచ్చిన ట్యాంకర్ గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు dead bodyని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కంచన్ భాగ్ కు చెందిన వ్యక్తి అని తెలిసింది. 

ఇదిలా ఉండగా.. నగర్ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాల ముందు వెల్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకున్న కార్లు ఢీ కొన్నాయి. ఘటనలో ప్రాణనష్టం తప్పినట్లు స్థానికులు తెలిపారు. 

సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై అసహజ లైంగికదాడి ఆరోపణలు.. బాడీగార్డును కత్తితో బెదిరించి...

మరో ఘటనలో పెళ్లికి వెళ్లి వస్తూ అన్నాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ incident కొత్తూరు పురపాలక పరిధి తిమ్మాపూర్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moosapet Zone  కొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జటారం చంద్రశేఖర్(25) తన చెల్లి మద్దూరి మమత(24) తో ఖిల్లాఘనపురంలో ఉన్న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అక్కడ పెళ్లి చూసుకుని తిరిగి  బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి Hyderabadకు Two-wheelerపై ప్రయాణమయ్యారు. మార్గ మాధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారి మీద బంకులోకి వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు మృతి చెందారు. 

మంథనిలో ఘోర రోడ్డుప్రమాదం... బస్సు, డిసిఎం వ్యాన్ ఢీ, 24మందికి తీవ్రగాయాలు

ఈ అన్నా చెలెళ్లిద్దరూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మమతకు ఏడాది క్రితం నారాయణ పేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన మద్దూరి అమరేందర్ రెడ్డితో వివాహమైంది. accident విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి ఏఎస్సై అబ్దుల్లా చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వద్దనే తండ్రి తిమ్మారెడ్డి, తల్లి కల్లమ్మలు ఉంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?