తన ప్రైవేట్ అవయవాల్లో ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్డు జొప్పించుకొని...

First Published 23, Jul 2018, 11:27 AM IST
Highlights

తాగిన మైకంలో ఓ వ్యక్తి తనపై తానే అత్యంత క్రూరంగా వ్యవహరించుకున్నాడు. తన మల ద్వారంలోకి ఇనుప రాడ్డును జొప్పించుకుని అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించాడు. అయితే ఈ వింతైన, అసహజ చర్య చివరికి  అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లోని బోరబండ వీఆర్ నగర్ లో కృష్ణ(60) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో ఈ నెల 20 న ఫుల్లుగా తాగివచ్చిన కృష్ణ తీవ్ర మలబద్దకంతో భాదపడుతూ అసహజ చర్యలకు పాల్పడ్డాడు. తన మల ద్వారంలోకి ఓ ప్లాస్టిక్ పైపును జొప్పించాడు. దీంతో అది అందులో ఇరుక్కుపోవడంతో మళ్లీ దాన్ని బయటకు తీయడానికి ఓ ఇనుప రాడ్ ను కూడా జొప్పించాడు. ఈ రెండు అందులోనే ఇరుక్కుని తీవ్ర రక్తస్రావం అయ్యింది.
 
ఈ విషయాన్ని గమనించి కుటుంబసభ్యులు అతడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడికి డాక్టర్లు ఆపరేషన్ చేసి ఈ రెండు వస్తువులను బయటకు తీశారు. అయినప్పటికి అప్పటికే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

Last Updated 23, Jul 2018, 11:27 AM IST