తెలంగాణ డేటా దొరికింది: ఐటీ గ్రిడ్‌పై స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Mar 7, 2019, 5:53 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ సేకరించిందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ సేకరించిందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు.

గురువారం నాడు ఐటీ గ్రిడ్‌పై ఏర్పాటు చేసిన సిట్ ప్రత్యేకాధికారి స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్‌పై ఏర్పాటు చేసిన సిట్ విచారణను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.

ఇప్పటివరకు సైబరాబాద్, హైద్రాబాద్ పోలీసులు  జరిపిన విచారణ గురించి తెలుసుకొన్నామని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో సైబర్ నిపుణుల అవసరం ఉందని చెప్పారు. 

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు  గురి కావాల్సిన అవసరం లేదని స్టీఫెన్ రవీంద్ర సూచించారు.9 మంది సిట్‌ బృందంలో ఉన్నట్టు ఆయన తెలిపారు.  ఐటీ గ్రిడ్‌పై వచ్చిన ఆరోపణలపై శాస్త్రీయంగా ఆధారాలను సేకరిస్తామన్నారు.  సేవా మిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కేసు నిష్పక్షపాతంగా కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు. టెక్నికల్‌గా నిపుణులు అవసరం ఉందని చెప్పారు.ఐటీ గ్రిడ్ సీఈఓ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.

లబ్దిదారుల డేటా ఈ యాప్‌లోకి ఎలా వచ్చింది, ఎవరు ఈ డేటాను ఇచ్చారనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు ఆయన తెలిపారు.ఐటీ గ్రిడ్ నుండి సీజ్‌ చేసిన వస్తువుల్లో కొంత సమాచారాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. 

తెలంగాణ డేటాను అవకతవకలను ఏమైనా చేశారా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆశోక్ ఎక్కడ ఉన్నా అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా విచారిస్తామని చెప్పారు. 

ఆశోక్‌ను చట్టపరంగానే తీసుకొస్తామని ఆయన చెప్పారు.ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవా మిత్రలోని కొన్ని ఫీచర్లు పనిచేయకుండా చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. చట్టం ముందు అందరూ కూడ సమానులేనని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 

సంబంధిత వార్తలు

కేంద్రం, తెలంగాణ సర్కార్లు టెర్రరిస్టులు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

 

 

click me!