వైద్య సిబ్బంది నిర్వాకం: పిల్లల అస్వస్థతకు కారణమిదే

By narsimha lodeFirst Published Mar 7, 2019, 1:45 PM IST
Highlights

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య సిబ్బంది చేసిన పొరపాటు  15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యాడు. వీరిలో ఒక్క చిన్నారి మృతి చెందారు. అస్వస్థతకు గురైన చిన్నారులు నీలోఫర్‌తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్:  నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య సిబ్బంది చేసిన పొరపాటు  15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యాడు. వీరిలో ఒక్క చిన్నారి మృతి చెందారు. అస్వస్థతకు గురైన చిన్నారులు నీలోఫర్‌తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో గురువారం నాడు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేసుకొన్న చిన్నారులకు నొప్పి రాకుండా ఉండేందుకు గాను ప్యారాసిటమల్ మందు బిళ్లలను ఇస్తారు. 

అయితే ప్యారాసిటమల్‌కు బదులుగా ట్రామడల్ మందు బిళ్లలను చిన్నారులకు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది ఇచ్చారు. ఈ మందు బిళ్లల కారణంగానే చిన్నారులు  అస్వస్థతకు గురైనట్టుగా నీలోఫర్  వైద్యులు నిర్ధారించారు.

గురువారం నాడు 90 మంది వ్యాక్సిన్ తీసుకొన్న చిన్నారుల్లో  సుమారు 22 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందారు. 

అయితే బుధవారం నాడు నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ తీసుకొన్న చిన్నారులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి  ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై  వైద్యులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి: 15 మందికి అస్వస్థత

 

click me!