
కంటోన్మెంట్ : కన్న కూతురి మీద molestationకి పాల్పడిన fatherని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గురురవాం బోయిన్ పల్లి పీఎస్ లో బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. Mahabnagar Districtకు చెందిన రమేష్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చెత్త సేకరణతో ఉపాధి పొందుతున్నాడు. 15 యేళ్ల క్రితం సరోజ అనే మహిళను వివాహం చేసుకున్న రమేష్, వీరికి ఒక పాప జన్మించిన కొన్ని రోజులకే Divorce తీసుకున్నాడు. పదేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కుమారుడితో కలిసి బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి బుధవారం రాత్రి కుమార్తెపై లెంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న అతడి రెండో భార్య రమేష్ ను అడ్డుకుంది. కన్న కూతురు కాకపోయినా తల్లి ప్రేమతో ఆమెను కీచకభర్త నుంచి కాపాడింది. అయినా, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బోయిన్ పల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రమేషన్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందిుతుడిని రిమాండ్ కు తరలించారు. సమావేశంలో ఇన్ స్పెక్టర్ రవికుమార్, సబ్ ఇన్ స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మార్చి 8న ఇలాంటి ఘటనలో నిజామాబాద్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కన్న కూతురి మీద అత్యాచారానికి పాల్పడిన తండ్రికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ Pokso Court జడ్జి పంచాక్షరి సోమవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెడితే.. Nizamabad District రుద్రూర్ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్య నిమిత్తం పిల్లలను ఇంట్లోనే ఉంచి తల్లి వేరే గ్రామానికి వెళ్లారు. 2018 మే 16న మద్యం మత్తులో ఉన్న తండ్రి పెద్ద కుమార్తెపై Rape చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాలిక గర్భం దాల్చడంతో గర్భస్రావ మాత్రలు వేయించాడు. అనంతరం 2019 జూన్ 28న మరోసారి భార్యను కొట్టి కూతురిని తన వద్దకు పంపించాలంటూ బెదిరించాడు. దీంతో భర్త నిర్వాకంపై రుద్రూర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తరఫున పీపీలు అల్లూరి రాంరెడ్డి, బంటు వసంత వాదనలు వినిపించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20యేళ్లు కఠిన కాగారార శిక్ష రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయసేవా సంస్థ ద్వారా రూ. 1.50 లక్షల పరిహారం కోసం బాలిక దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
ఇలాంటి అమానుష ఘటనే ఫిబ్రవరి 24న జరిగింది. మధ్యప్రదేశ్ లో ఓ కన్నతండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి.. పైశాచికత్వానికి ఒడిగట్టాడు. కంటిపాపలా... చూసుకోవాల్సింది పోయి.. విషనాగులా కాటేశాడు. అత్యంత దారుణమైన.. హేయమైన.. పాశవిక చర్యకు ఒడిగట్టాడు. కూతుర్ని చంపి... ఆమె మృతదేహంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. సభ్య సమాజం కలలో కూడా ఊహించని అత్యంత భయంకరమైన ఘటన ఇది. Madhya Pradesh గునా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కుమార్తె(14)ను హత్య చేసిన ఓ తండ్రి అంతటితో ఆగకుండా ఆమె dead body మీద molestationకి పాల్పడ్డాడు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మీద అఘాయిత్యం చేసిన ఆ వ్యక్తి.. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు తన కుమార్తె missing అని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక బంధువులను, ఇరుగుపొరుు వారిని విచారించారు. బాలిక చివరగా తండ్రితోనే కనిపించిందని అందరూ చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి నిందితుడిని తమదైన శైలిలో విచారించగా.. నిజం అంగీకరించాడు.