రామప్ప దర్శన్ పేరిట.. తెలంగాణ ఆర్టీసీ బస్సులు.. ఆ రోజుల్లో అందుబాటులోకి...

By SumaBala BukkaFirst Published Mar 18, 2022, 12:58 PM IST
Highlights

ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడపడానికి ఎండీ సజ్జనార్ ఎన్నో వినూత్న కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే రామప్ప దర్శన్ పేరిట ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. 

తెలంగాణ :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇక ఆర్టీసీ ఎండీగా Sajjanar బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో మార్పులు జరిగాయి. ప్రయాణికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  మెరుగైన ప్రయాణం కోసం అద్భుతమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే Ramappa Temple - Laknavaram  ఒకే సారి చూసే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ప్రయాణికుల కోసం రామప్ప దర్శనం పేరిట ప్రత్యేక Bus serviceలను తీసుకువచ్చింది. 

 ప్రభుత్వ సెలవు దినాలు, ప్రతి రెండవ శనివారం ఆర్టీసీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ సర్వీసులను నడపనున్నట్లు ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ సర్వీసులు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరనున్నట్లు వెల్లడించారు. ఈ సదుపాయాలను  ప్రయాణికులు  సద్వినియోగం  చేసుకోవాలని తెలిపారు.  మరిన్ని వివరాలకు డిపో మేనేజర్ 9959226048 నెంబర్ ను సంప్రదించాలని ట్వీట్ చేశారు ఎండి సజ్జనార్. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండేలా చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు హాజరవ్వాలంటే.. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలని ఆ సందర్భంగా ఆయన ప్రయాణికులకు సూచించారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ ప్రవేశపెట్టారు. ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారి ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు. 

50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని ఆయన గుర్తుచేశారు. మొదట రెండెంకల బస్సులతో 1970లో ప్రారంభమయ్యిందని.. ప్రస్తుతం అది 7 వందలకు పెరిగిందని సజ్జనార్ అన్నారు. గతేడాది 19 లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామని... అప్పుడు 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్పులు నడిపామని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని .. గతేడాది 30 కోట్ల ఆదాయం వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సారి 3,845 బస్సులు నడుపుతున్నామని.. మొత్తం 51 పాయింట్స్ నుంచి మేడారానికి బస్సులు తిరుగుతాయని చెప్పారు.  ఇతర రాష్ట్రాలు నుంచి కూడా బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ వెల్లడించారు. 

30 మంది ప్రయాణికులు ఉంటే 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ఆర్టీసీ వెబ్ సైట్‌ను చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఈనెల 13వ తేదీ నుంచి జాతరలో రద్దీ పెరుగుతుందని.. 12వేల మంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. 8 రోజుల పాటు ఆర్టీసి అధికారులు మేడారంలో ఉంటారని, 50 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్టీసి ఆధ్వర్యంలో 3 వందల మంది ప్రత్యేకంగా వాలంటర్స్ గ్రౌండ్‌లో ఉంటారని, వరంగల్ నుంచి 2 వేలకు పైగా బస్సులు నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండి తెలిపారు. 

స్పెషల్ బస్సులన్నీ కండక్టర్ లెస్‌గానే వుంటాయని.. ప్రైవేటు పార్కింగ్ స్థలం నుంచి 30 షెటిల్ బస్సులు నడుస్తాయని, 11 మొబైల్ మెకానికల్ టీమ్స్ మేడారం రూట్‌లో అందుబాటులో ఉంటాయని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూం , సిసి టివి కెమెరాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బస్సులు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఆర్టీసి ఆధ్వర్యంలో రెండు కళా బృందాలను సైతం ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు.
 

click me!