ఎస్టీ బాలికపై పలుమార్లు అత్యాచారం, గర్భం దాల్చడంతో, అబార్షన్ చేయించి.. ఓ కామాంధుడి దారుణం...

Published : Jun 17, 2022, 09:12 AM IST
ఎస్టీ బాలికపై పలుమార్లు అత్యాచారం, గర్భం దాల్చడంతో, అబార్షన్ చేయించి.. ఓ కామాంధుడి దారుణం...

సారాంశం

ఓ పద్నాలుగేళ్ల బాలికమీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ క్రమంలో ఆమె గర్బం దాల్చడంతో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అబార్షన చేయించాడు. 

హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో Minor girlపై అత్యాచార ఘటన మరవకముందే జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది.  Jawahar Nagar కు చెందిన 14 ఏళ్ల బాలిక తండ్రి మరణించడంతో..  తల్లి కూలీ పనికి వెళుతూ పిల్లల్ని పోషిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు. రెండు నెలల క్రితం తల్లి కూలి పనికి వెళ్ళగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికపై molestationకి పాల్పడ్డాడు.  ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. 

ఆ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుండడంతో ఆమెను ఆ దుర్మార్గుడు ఓ ఆర్ఎంపి వైద్యుడికి చూపించాడు. బాలిక వయస్సు 20 ఏళ్లుగా పేర్కొని స్కానింగ్ చేయించాడు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ కావడంతో అబార్షన్ చేయించాడు. బాలిక తల్లికి ఈ విషయం తెలియడంతో.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : నిందితుల్లో ‘‘ లైంగిక సామర్ధ్యం ’’.. తేల్చిసిన పోటెన్సీ టెస్ట్ రిపోర్ట్

ఇదిలా ఉండగా, జూన్ 11న ఇలాంటి ఘోరమే హైదరాబాద్ లో మరొకటి వెలుగులోకి వచ్చింది.  ‘మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తా.. అని బెదిరించి ఓ auto driver బాలికపై sexual harassmentకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ntr nagarకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి ఉంటోంది. వారి ఎదురింట్లో ఉంటున్న షేక్ సలీం (30) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తరచుగా గొడవ పడుతుండడంతో కొద్ది రోజుల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీమ్  అతని ఇంటి ఎదురుగా ఉన్న బాలిక మీద కన్నేశాడు. మూడు రోజులుగా పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలికకు ఆమె బాబాయ్ అంటే భయం ఉండడంతో... ఈ విషయం బయటికి చెబితే మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తానని బెదిరించడంతో ఆమె భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. అయితే, గురువారం బాధితురాలు సలీమ్ ఇంట్లో నుంచి రావడాన్ని గుర్తించిన పక్కన ఉండే మరో మహిళ... తల్లి దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఆమె బాలికను నిలదీయడంతో మూడు రోజులుగా సలీం తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. 

దీంతో ఆమె స్థానికుల సహాయంతో సలీమ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు షేక్ సలీంను ఎల్బీనగర్ పోలీస్  అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరిచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్