బడిలో దాగుడుమూతలు ఆడుతుండగా కరెంట్ షాక్.. 11యేళ్ల చిన్నారి మృతి..

By SumaBala Bukka  |  First Published Jun 17, 2022, 7:22 AM IST

దాగుడుమూతలు ఆడుతున్న చిన్నారి తన స్నేహితులకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్లిపోయింది. ఎవ్వరికీ దొరకకూడదని స్కూల్ వెనక్కి వెళ్లి కరెంట్ షాక్ తో మరణించింది. 


వరంగల్ :  బడివేళలు ముగిశాక పిల్లలంతా hide-and-seek ఆడుకునేందుకు సిద్ధమయ్యారు. ఓ బాలిక మాత్రం ఎవరికీ దొరకక కూడదని ఉద్దేశంతో school వెనక్కి వెళ్ళింది. అదే ఆమె పాలిట శాపమైంది. Electric shock ఆ చిన్నారి ప్రాణం తీసింది. శాశ్వతంగా తన స్నేహితులకు దొరకనంత దూరం తీసుకువెళ్ళింది. ఈ విషాదం Warangal District సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. లింగాల అనూషకు ఇద్దరు కుమార్తెలు, భర్తతో గొడవల కారణంగా కొంత కాలంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె రాజేశ్వరి (11) మూడురోజుల కిందటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి లో చేరింది.

గురువారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో ఉపాధ్యాయులు ఆడుకునేందుకు అనుమతించడంతో బాలికలంతా జట్లుగా విడిపోయి దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. కాసేపటి తర్వాత దాక్కునే క్రమంలో రాజేశ్వరి పాఠశాల భవనం వెనక్కి వెళ్ళింది. బోరు బావికి అనుసంధానించిన విద్యుత్తు తీగ కాళ్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. బాలిక కేకలతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బాధిత చిన్నారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Latest Videos

undefined

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : నిందితుల్లో ‘‘ లైంగిక సామర్ధ్యం ’’.. తేల్చిసిన పోటెన్సీ టెస్ట్ రిపోర్ట్

ఇదిలా ఉండగా, తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుంటుందని... అది పోవాలంటే పూజలు చేయాలి.. అనుకున్న ఓ తండ్రి.. తన కన్న కూతురి ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. ఒంటిపై పసుపు నీళ్ళు పోసి, నోటి నిండా కుంకుమ పోసి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ప్రొక్లెయిన్ నిర్వహణతో నష్టపోయిన వేణుగోపాల్.. బుధవారం తన  కవల కుమార్తె ల్లో ఒకరైన Punarvika (3)ను  పూజగదిలో పడుకో బెట్టి,  పసుపు నీళ్లు పోశాడు. తర్వాత నోట్లో కుంకుమ, పసుపు పోసి మింగమని బలవంత పెట్టాడు. అయితే ఆ పసుపు, కుంకుమలతో ఊపిరి ఆడకపోవడంతో..  బాలిక కేకలు వేసింది. 

అప్పుడే ఆ గదిలోకి వచ్చిన భార్య అది చూసి.. గట్టిగా అరిచి, కేకలు వేసి.. సాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిచింది. అవి విన్న చుట్టుపక్కల వారు వచ్చి ఆ చిన్నారిని.. మొదట ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి చెన్నైకి తీసుకువెళ్లారు. తాను దేవుడినని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వేణుగోపాల్ ను బంధువులు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. వేణుగోపాల్ గత మూడు రోజులుగా ఏవేవో పూజలు చేస్తూనే ఉన్నాడని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆత్మకూరు ఎస్ఐ శివశంకరరావు కేసు నమోదు చేసి వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. 

click me!