నాగార్జునసాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత: 28 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

By narsimha lodeFirst Published Aug 21, 2020, 12:09 PM IST
Highlights

:శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు చేరడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం నాడు అధికారులు ఎత్తారు. నాలుగు గేట్టను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నల్గొండ:శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు చేరడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం నాడు అధికారులు ఎత్తారు. నాలుగు గేట్టను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణా బేసిన్ లో భారీగా వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్ కు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో  నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారంనాడు ఉదయానికి 585 అడుగులకు చేరుకొంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి 29,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఈ ప్రాజెక్టులో 312 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం 290 టీఎంసీల నీరు  ఉంది.  

గత ఏడాది ఆగష్టు 12 వ తేదీన నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు.  గత ఏడాది ఆగష్టు 12వ తేదీన 596 అడుగులకు చేరిన సమయంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గత ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండాయి.

ఈ ఏడాది కృష్ణా బేసిన్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడ భారీగా వర్షాలు నమోదయ్యాయి. శ్రీశైలం నుండి భారీగా నీరు విడుదల కావడంతో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 

click me!