స్వవర్గంలోనే వ్యతిరేకతలు.. రాజు జాగ్రత్తగా ఉండాలి: టీ సర్కార్ ఉగాది వేడుకల్లో బ్రహ్మర్షి సంతోష్‌కుమార్

By Sumanth KanukulaFirst Published Mar 22, 2023, 1:27 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శోభ‌కృత్ నామ సంవత్సర ఉగాది వేడుక‌లను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శోభ‌కృత్ నామ సంవత్సర ఉగాది వేడుక‌లను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీ శోభకృత నామ పంచాంగాన్నిఆవిష్క‌రించారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు. అనంతరం శారదపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాగం శ్రవణం పటించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉండి.. నిత్యం ప్రజా ప్రయోజనాల కోసం చాలా రకాలైన కార్యక్రమాలను ప్రభుత్వ రంగ నిపుణలు  తయారుచేస్తారని అన్నారు. చాలా రోజుల నుంచి ఆగిన పనులు ఈ ఏడాదిలో పూర్తి అవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందని చెప్పారు. 

ప్రభుత్వం సుస్థిరంగా ఉండి.. నిత్యం ప్రజా ప్రయోజనాల కోసం చాలా రకాలైన కార్యక్రమాలను ప్రభుత్వ రంగ నిపుణలు  తయారుచేస్తారని అన్నారు. చాలా రోజుల నుంచి ఆగిన పనులు ఈ ఏడాదిలో పూర్తి అవుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు స్వవర్గంలో ఉన్న కొందరు వ్యక్తుల నుంచి కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం లేకపోలేదని అన్నారు. ఈ విషయంలో రాజు చాలా జాగ్రత్తగా ఉండవల్సిన సూచనను పంచాంగం చెబుతుందని తెలిపారు. అయితే రాజు దువుకున్న వ్యక్తి, చాలా విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తి, సమర్థుడు కావడం చేత.. అటువంటి విపరీత ధోరణులను అణచివేసే అవకాశం ఉందని అన్నారు.

ఈ ఏడాది కాళేశ్వరం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండబోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది పాడి, పంటలు అద్బుతంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రం రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ ఏడాది విద్యారంగంలో సమూల మార్పులు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో ఈ ఏడాది కల్తీ ఎక్కువ అవుతుందని అన్నారు. విషజ్వరాలు, కరోనా లాంటి వ్యాధులు రావని తెలిపారు. తెలుగు సినీ  ఇండస్ట్రీకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. 

కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు రానున్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో స్త్రీలలో విజయవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 

click me!