ఫిబ్రవరి 2 నుండి 14 వరకు రామానుజ సహస్రాబ్ది వేడుకలు: చినజీయర్ స్వామి

Published : Jan 31, 2022, 04:49 PM ISTUpdated : Jan 31, 2022, 05:57 PM IST
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు రామానుజ సహస్రాబ్ది వేడుకలు: చినజీయర్ స్వామి

సారాంశం

ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నామని త్రిదండి రామానుజ జీయర్ స్వామి చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: ప్రస్తుత సమాజానికి సమతా స్పూర్తి అవసరమని చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.సోమవారం నాడు హైద్రాబాద్ లోని Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamiji మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది రామానుజాచార్యులు అని ఆయన గుర్తు చేశారు. రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగను ఫిబ్రవరి రెండు నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని  చినజీయర్ స్వామి చెప్పారు.Corona నిర్మూలన కోసం 1035 కుండాల యాగం నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని ఆయన చెప్పారు.

మనిషి అంతరంగంలో అహంకారం అనే జబ్బును నయం చేసేందుకు సమతా స్పూర్తి అనే మందును వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు కనిపెట్టారని జీయర్ స్వామి తెలిపారు.

సమాజంలో రకరకాల విశ్వాసాలుంటాయన్నారు. అయినా ఒక్క సమాజంగా మానవుడు బతకుతున్నాడని  జీయర్ స్వామి చెప్పారు. మనుషులపై ఆధిపత్యం ప్రదర్శించే స్థితిని చూస్తున్నామన్నారు. దీనిని అంతరంగిక రోగాలంటామని జీయర్ స్వామి తెలిపారు. . దీనికి మనిషిలోని అహంకారం కారణంగా ఆయన పేర్కొన్నారు.

బయట వచ్చే రోగాలకే కాదు, అంతరంగికమైన జబ్బులకు కూడా మందులను కనుక్కోవాలన్నారు.  మనిషిలోని అహంకారానికి మందును రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే కనిపెట్టారని జీయర్ స్వామి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  సమతా స్పూర్తే మనిషిలోని అహంకారాన్ని తుదముట్టిస్తుందని రామానుజాచార్యులు చెప్పారని జీయర్ స్వామి తెలిపారు. 

శరీరంలోని అన్ని అవయవాలు కలిసి పనిచేసినట్టుగానే సమాజంలో అందరికి సమాన అవకాశాలు ఉండాలన్నదే సమతా స్పూర్తి ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమేనన్నారు.శ్రీరామనుజ చరిత్రను థియేటర్ లో భక్తులకు ప్రదర్శిస్తామన్నారు. ముచ్చింతల్ లోని సమతామూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశామన్నారు. 108 దివ్వక్షేత్రాల్లో అహోబిలం, పాలసముద్రం, వైకుంఠం తదితర రూపాలుంటాయన్నారు. 

ప్రపంచానికి సమానత్వాన్ని ప్రబోధించడానికే సమతామూర్తి కేంద్రాన్ని నిర్మించినట్టుగా ఆయన చెప్పారు. సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తుల చరిత్రను సమతా స్పూర్తి కేంద్రంలో ఉంటుందన్నారు. కులం అనే హద్దులు దాటాల్సిన అవసరం ఉందని జీయర్ స్వామి అభిప్రాయపడ్డారు.  సమతామూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ప్రకృతి, జంతువులను ఉనికిని మనిషి నాశనం చేస్తున్నారన్నారు.నీళ్లను, భూమిని కలుషితం చేయవద్దని ఆయన కోరారు. సర్వప్రాణి సేవే నినాదంగా రామానుజచార్యులు ముందుకు సాగిన విషయాన్ని జీయర్ స్వామి గుర్తు చేసుకొన్నారు.సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన వైరస్ అసమానత అని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నారన్నారు. సమాజంలోని కులాల మధ్య సమానత కొరవడిందన్నారు.

వెయ్యేళ్ల క్రితమే దళితులను రామానుజచార్యులు ఆలయ ప్రవేశం చేయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యావిధానం మంచి మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆజాదీక్ అమృత్ ఉత్సవాల్లో మహానీయుల గొప్పతనం గురించి తెలుసుకొంటున్నామని జీయర్ స్వామి తెలిపారు.ఇందులో భాగంగానే రామానుజచార్యుల వెయ్యే ళ్ల పండుగ వచ్చిందని భావిస్తున్నామన్నారు.సమతామూర్తి కేంద్రంలో 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహన్ని ఏర్పాటు చేశామన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!