
సిద్దిపేట: Siddipet పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కాల్పులు జరిపి రూ. 43.50 లక్షలను చోరీ చేసిన దుండగులను పట్టుకొనేందుకు ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టుగా సిద్దిపేట CP శ్వేత తెలిపారు.
సిద్దిపేట Registration కార్యాలయం వద్ద కాల్పులు జరిగిన ప్రాంతాన్ని Swetha సోమవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బైక్ పై వచ్చి నిందితులు కాల్పులకు దిగారని సీపీ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు ఎవరు, ఎటు వెళ్లారనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు.
ఇవాళ మధ్యాహ్నం ఓ భూమి విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడానికి సంతకాలు చేసేందుకు రియల్టర్ నర్సయ్య రిజిస్ట్రేషన్ కార్యాలయం లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆయనకారులో రూ. 43.50 లక్షల నగదు బ్యాగులో ఉంది. అయితే కారులో డ్రైవర్ పరశురామ్ ఉన్నాడు. కారు డ్రైవర్ కారు అద్దాలు బిగించుకొని కూర్చొన్నాడు.
ఈ సమయంలోనే bike పైన వచ్చిన దుండగులు మాస్కులు ధరించి కారు driver పై కాల్పులకు దిగి రూ. 43.50 లక్షలను దోచుకెళ్లారు.భూ విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలు చేసేందుకు రియల్టర్ Narsaiah రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. నర్సయ్య కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న నగదు బ్యాగును తీసుకొన్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కారు డ్రైవర్ పరుశురామ్ కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు డ్రైవర్ కాలుపై firing కి దిగారు. దీంతో పరుశురామ్ గాయపడ్డారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న స్థానికులు చూసి నిందితులను పట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే తమ వద్ద ఉన్న pistol ని చూపి నిందితులు పారిపోయారు.
ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నర్సయ్య కొనుగోలు చేసే భూ విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ భూమి ఏమైనా వివాదంలో ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులు నర్సయ్యను ఇంటినుండి ఫాలో అయ్యారా లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్దే కాపు కాశారా అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.