మహబూబ్‌నగర్‌కు చెందిన దివ్యాంగ బాలుడిపై పూణెలో లైంగిక దాడి.. తర్వాత గోనె సంచిలో పెట్టి..

Published : Mar 27, 2022, 04:14 PM IST
మహబూబ్‌నగర్‌కు చెందిన దివ్యాంగ బాలుడిపై పూణెలో లైంగిక దాడి.. తర్వాత గోనె సంచిలో పెట్టి..

సారాంశం

మహారాష్ట్రలోని పూణెలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల దివ్యాంగుడైన బాలుడిపై దారుణంగా లైంగిక దాడి చేసిన దుండగులు.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. అనంతరం బాలుడిని మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పడేశారు.

మహారాష్ట్రలోని పూణెలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల దివ్యాంగుడైన బాలుడిపై దారుణంగా లైంగిక దాడి చేసిన దుండగులు.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. అనంతరం బాలుడిని మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పడేశారు. అయితే అత్యంత దారుణంగా లైంగిక దాడికి, హత్యకు గురైన బాలుడిది తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాగా గుర్తించారు. వివరాలు.. మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడ్‌ మండలానికి చెందిన దంపతులు పొట్ట కూటి కోసం పూణెకు వెళ్లింది. అక్కడే బతుకుదెరువు కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. 

దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. అందులో రెండో సంతానమైన బాలుడు దివ్యాంగుడు (మూగ). దీంతో తల్లిదండ్రులు బాలుడిని పాఠశాలకు పంపలేదు.  కరోనా కారణంగా రెండేళ్ల క్రితం సొంత గ్రామానికి వచ్చి.. తిరిగి రెండు నెలల క్రితం పూణెకు సదరు బాలుడిని వెంట తీసుకొని వెళ్లారు. తల్లిదండ్రులు రోజు కూలీ పనులకు వెళ్తుండగా.. బాలుడిని ఇంటి వద్దే ఉంచేవారు. గురువారం రోజులాగే తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలుడు ఇంటివద్దే ఉన్నాడు.

kothrud పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు ఉంటున్న ఇంటిపక్కనే నివాసం ఉంటున్న యూపీకి చెందిన ఒక వ్యక్తి సాయంత్రం అతడిని బయటకు తీసుకెళ్లాడు. ఇందుకు మరో వ్యక్తి కూడా సాయం చేశాడు. ఇద్దరు కలిసి బాలుడిని బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లి.. మరికొందరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలుడిపై దాడి కూడా చేశారు. అనంతరం బాలుడిని హత్య చేశారు. అనంతరం  బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి చెత్తకుండిలో వేస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. బాలుడి ఆచూకీ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అయితే బాలుడి కోసం వెతుకుతున్న వారికి పోలీసులు.. జరిగిన విషయం చెప్పారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పూణె నుంచి శనివారం ఉదయం గండేడ్‌ మండలంలోని స్వగ్రామానికి బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలుడి మృతదేహాన్ని చూసి తండావాసుల కన్నీరుమున్నీరయ్యారు. తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఇక, ఈ ఘటనకు సంబంధించి బాలుడి ఇంటి పక్కన నివాసం ఉండే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా Kothrud పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర జగ్తాప్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్