గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక వార్డును కేటాయించింది ప్రభుత్వం. ఈ వార్డుకు మనోజ్ కుమార్ వార్డుగా పేరు పెట్టారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ఈ నెల 7వ తేదీన మరణించాడు.
హైదరాబాద్:గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక వార్డును కేటాయించింది ప్రభుత్వం. ఈ వార్డుకు మనోజ్ కుమార్ వార్డుగా పేరు పెట్టారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ఈ నెల 7వ తేదీన మరణించాడు.
undefined
కరోనా సోకిన మనోజ్ కుమార్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన మరణించాడు. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 16 మంది జర్నలిస్టు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లకు కరోనా సోకింది. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతునన్నారు.
also read:గాంధీలో జూనియర్ డాక్టర్లపై దాడి: రాష్ట్రంలో పలు చోట్లు జూడాల నిరసన
మనోజ్ కుమార్ గాంధీ ఆసుపత్రిలో మరణించడంతో ప్రత్యేక వార్డును గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కరోనాపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కంటైన్మెంట్ జోన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జర్నలిస్టు. ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు ఇప్పుడిప్పుడే కరోనా బారిన పడుతున్నారు. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులను వైద్యులు కోరుతున్నారు.
గాంధీ ఆసుపత్రిలోని ఆరో వార్డులో జర్నలిస్ట్ మనోజ్ పేరుతో జర్నలిస్టులకు ప్రత్యేకంగా కరోనా వార్డును ఏర్పాటు చేసినట్టుగా గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు కరోనా సమయంలో ముందుండి సేవలు చేస్తున్న విషయం తెలిసిందే.