ఛలో సెక్రటేరియట్: ఉత్తమ్ సహా పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 11, 2020, 11:12 AM IST
Highlights

 తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను పోలీసులు గురువారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలను పోలీసులు గురువారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు. 

విద్యుత్ ఛార్జీలు, రైతు బంధుతో పాటు ఇతర సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఛలో సెక్రటేరియట్  కు పిలుపునిచ్చింది.టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

నేతలు ఇంటి నుండి బయటకు రాకుండా అడ్డుకొన్నారు. పోలీసులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని కాంగ్రెస్ నేతలకు పోలీసులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

విద్యుత్ బిల్లులతో ప్రజలపై భారం మోపారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మూడు మాసాల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కూడ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మూడు రోజుల క్రితం డిమాండ్ చేశారు.
 

click me!