12 మంది ప్రయాణికులతో భారత్ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం.. పాకిస్థాన్‌లోని కరాచీలో ల్యాండ్.. అసలేం జరిగింది?

By Bukka Sumabala  |  First Published Aug 16, 2022, 8:47 AM IST

భారత్ నుంచి 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్ విమానం.. పాకిస్తాన్ లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. కాసేపటికే అక్కడినుంచి బయలుదేరింది.


ఢిల్లీ : భారత్ నుంచి పన్నెండు మంది ప్రయాణికులతో బయలుదేరిన చార్టర్ విమానం సోమవారం పాకిస్తాన్‌, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. తరువాత మధ్యాహ్నం 12:10 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కరాచీ విమానాశ్రయంలో దిగిందని జియో న్యూస్ మీడియా సమాచారం. 

సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రతినిధి ఈ ఘటనను ధృవీకరించారు. అంతర్జాతీయ చార్టర్ ఫ్లైట్ భారత్ నుంచి బయలు దేరిన తరువాత దానితో ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. అయితే, కరాచీలో దిగిన కొద్దిసేపటికే 12 మంది ప్రయాణికులతో ఆ ప్రత్యేక విమానం మళ్ళీ బయలుదేరింది. అయితే కరాచీలో విమానం ఎందుకు ల్యాండ్ అయిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Latest Videos

undefined

నువ్వే ఓ బాంబర్.. ప్రియుడితో ప్రియురాలి సరదా చాటింగ్...ఆరు గంటల పాటు ఆగిపోయిన విమానం...

సాంకేతిక సమస్యల కారణంగా గత నెలలో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాజా ఘటన చోటు చేసుకుంది. స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానం ఫ్యూయల్ ఇండికేటర్ లో మిడ్-ఎయిర్ లోపం కారణంగా జూలై 5న కరాచీకి మళ్లించారు. ఇంజన్‌లలో ఒకదానిలో లోపాన్ని పైలట్లు గమనించడంతో జూలై 17న ముందుజాగ్రత్తగా ఇండిగో షార్జా-హైదరాబాద్ విమానాన్ని కరాచీకి మళ్లించారు.

click me!