29న తెలుగు యూనివర్సిటీలో దక్షిణ భారత ట్రావెల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్

By Mahesh KFirst Published Aug 28, 2023, 9:40 PM IST
Highlights

హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరవింద్ ఏవీ అనే వర్ధమాన ఫొటోగ్రాఫర్ ఫొటోల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ రచయిత్రి ఓల్గా ప్రారంభించగా.. ముఖ్య అతిథులుగా కే శ్రీనివాస్, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు.
 

హైదరాబాద్: ఈ నెల 29న (రేపు) నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఫొటోఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతంలో ప్రయాణించి తీసిన ఫొటోల సమాహారాన్ని రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీలోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచుతున్నారు. తన మొదటి ప్రయత్నంగా చేస్తున్న ఈ సౌత్ ఇండియా ట్రావెల్ ఫొటోగ్రఫీకి అందరికీ ఆహ్వానం చెప్పారు అరవింద్ ఏవి. 

ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ రచయిత్రి ఓల్గా ప్రారంభిస్తున్నారు. ముఖ్య అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు తంగెడ కిషన్ రావు, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ భట్టు రమేశ్, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినిమా దర్శకులు అనుదీప్ కేవీ హాజరవుతున్నారు.

Also Read: లాయర్ చాంబర్‌లో కూడా దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు

అరవింద్ ఏవీ పుస్తక ప్రియుడు. యాత్రలు చేయడం ఇష్టపడే ఆయన అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించటాన్ని అలవాటు చేసుకున్నారు. వర్సిటీలు, కాలేజీల్లో స్టడీ సర్కిల్స్ ఏర్ాపటు చేసి సాహిత్య, సామాజిక అంశాలపై చర్చలు నిర్వహిస్తుంటారు. 2022లో విడుదలైన ప్రిన్స్ సినిమాకు రైటర్‌గా చేశారు. మరో సినిమాకూ రచయితగా పని చేస్తున్నారు.

click me!