ఫలక్ ‌నుమా ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచారణ: ఎస్‌సీఆర్ జీఎం అరుణ్

By narsimha lode  |  First Published Jul 7, 2023, 3:21 PM IST

ఫలక్ నుమా  ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే  జీఎం  అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. 


హైదరాబాద్: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో  అగ్ని  ప్రమాదంపై  విచారణకు  ఆదేశించినట్టుగా  దక్షిణ మధ్య రైల్వే  జీఎం అరుణ్ కుమార్ జైన్  చెప్పారు.ఫలక్ నుమా  రైలులో  ప్రమాదం  జరిగిన  సంఘటన స్థలాన్ని  జీఎం అరుణ్ కుమార్ జైన్   శుక్రవారంనాడు మధ్యాహ్నం పరిశీలించారు.  ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలక్ నుమా  రైలులో  అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. విచారణలో కారణాలు తెలుస్తాయని  ఆయన తేల్చి చెప్పారు.

ఈ రైలులోని   ప్రయాణీకులను  ప్రత్యేక రైలు, ఆర్టీసీ బస్సుల ద్వారా  సికింద్రాబాద్ కు తరలించినట్టుగా  జీఎం  అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ట్రాక్ పునరుద్దరణ పనులు  చర్యలు చేపడుతున్నామన్నారు.

Latest Videos

also read:బాలాసోర్ తరహా ప్రమాదమంటూ బెదిరింపు లేఖ: పోలీసుల అదుపులో అనుమానితుడు

ఎన్‌డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుందని  జీఎం వివరించారు.  బాలాసోర్ తరహాలో  రైలు ప్రమాదం జరిగే  అవకాశం ఉందని  వచ్చిన  బెదిరింపు లేఖపై  పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా జీఎం  చెప్పారు. మరో వైపు  ఈ ప్రమాదం కారణంగా  రెండు రైళ్లను రద్దు  చేసినట్టుగా  రైల్వే శాఖ జీఎం  ప్రకటించారు. మరికొన్ని రైళ్లను  ఇతర రూట్లలో మళ్లించినట్టుగా తెలిపారు.అగ్ని ప్రమాదానికి గురై న బోగీలను మినహాయించి  ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలును  సికింద్రాబాద్ కు తరలించామన్నారు.

click me!