బాలాసోర్ తరహా ప్రమాదమంటూ బెదిరింపు లేఖ: పోలీసుల అదుపులో అనుమానితుడు

By narsimha lode  |  First Published Jul 7, 2023, 2:38 PM IST

ఒడిశా బాలాసోర్  తరహాలో రైలు ప్రమాదం  జరుగుతుందని  వార్నింగ్ లేఖ  రాసినట్టుగా  అనుమానిస్తున్న వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


హైదరాబాద్: ఒడిశా బాలాసోర్  తరహాలో రైలు ప్రమాదం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖకు లేఖ  రాసినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని  పోలీసులు  శుక్రవారంనాడు అదుపులోకి  తీసుకున్నారు. హైద్రాబాద్ బీహెచ్ఈఎల్ కు  చెందిన  వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపు లేఖపై   పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ లేఖను  అతనే  రాశాడా, లేక  ఇంకా ఎవరైనా రాశారా  అనే విషయమై  దర్యాప్తు  చేస్తున్నారు.

జూన్  30వ తేదీన  ఈ లేఖ  దక్షిణ మధ్య  రైల్వే  శాఖకు అందింది.  ఈ లేఖపై రైల్వే శాఖాధికారులు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు. నార్త్ జోన్ పోలీసులు  ఈ లేఖపై  కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు.  ఈ లేఖ రాసినట్టుగా ఉన్న అనుమానితుడిని  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

Latest Videos

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా  కలకలం రేపిన విషయం తెలిసిందే . ఈ ఏడాది జూన్  2వ తేదీన  బాలాసోర్  వద్ద  రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  293 మంది  మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. 

also read:ఫలక్ నుమా ప్రమాదానికి బెదిరింపు లేఖకు సంబంధం లేదు: రైల్వే శాఖ

ఇదే తరహాలో  ఢిల్లీ- హైద్రాబాద్ రూట్లో రైలు ప్రమాదం జరిగే  అవకాశం ఉందని  ఈ లేఖలో  పేర్కొన్నారు. ఈ లేఖను  సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించి  ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కచ్చితమైన సమాచారం మేరకు  అతను లేఖ రాశాడా లేక ఇతరత్రా కారణాలతో లేఖ రాశాడా అనే విషయమై పోలీసులు విచారిస్తున్నారు.

ఇవాళ  ఫలక్ నుమా  ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ లేఖ అంశం చర్చకు వచ్చింది.  అయితే ఈ లేఖతో రైలులో ప్రమాదానికి  సంబంధం లేదని  రైల్వే శాఖ  సీపీఆర్ఓ రాకేష్ ప్రకటించారు.  

click me!