సికింద్రాబాద్‌ చేరుకున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్.. తృటిలో చావు నుంచి తప్పించుకున్నామన్న ప్రయాణీకులు

Siva Kodati |  
Published : Jul 07, 2023, 03:13 PM ISTUpdated : Jul 07, 2023, 03:23 PM IST
సికింద్రాబాద్‌ చేరుకున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్.. తృటిలో చావు నుంచి తప్పించుకున్నామన్న ప్రయాణీకులు

సారాంశం

మిగిలిన బోగీలతో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఫ్లాట్ ఫాం 1పై ప్రయాణీకులు క్షేమంగా దిగారు. ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నామని.. ఎవరో చైన్ లాగి రైలు ఆపకుంటే తామంతా సజీవదహనమయ్యేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. 

హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం‌తో దేశం మరోసారి ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. 7 బోగీలు పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రయాణీకులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మిగిలిన బోగీలతో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఫ్లాట్ ఫాం 1పై ప్రయాణీకులు క్షేమంగా దిగారు.

ఈ సందర్భంగా ప్రయాణీకులు తమ అనుభవాలను పంచుకున్నారు. తమ వస్తువులు , బ్యాగులు, డబ్బులు, టికెట్లు, మందులు అన్నీ ట్రైన్‌లోనే కాలిబుగ్గాయ్యాయని తెలిపారు. ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నామని.. ఎవరో చైన్ లాగి రైలు ఆపకుంటే తామంతా సజీవదహనమయ్యేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైన్‌లో కొందరు సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారని ప్రయాణీకులు ఆరోపించారు. 

ALso Read: ఫలక్ నుమా ప్రమాదానికి బెదిరింపు లేఖకు సంబంధం లేదు: రైల్వే శాఖ

అయితే వారం రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖకు  ఇవాళ  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రమాదానికి సంబందం లేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పష్టం చేశారు. ఫలక్ నుమా రైల్వే ప్రమాదంపై  విచారణ తర్వాతే  కారణాలు చెప్పగలమని  చెప్పారు. ఈ బెదిరింపు లేఖపై  పోలీసులు విచారణ చేస్తున్నారని  సీపీఆర్ఓ గుర్తు చేశారు. పోలీసుల విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉందని సీపీఆర్ఓ తెలిపారు. రైల్వే ప్రమాదానికి గల  కారణాలపై విచారణలో పూర్తి వివరాలు తేలుతాయన్నారు.

బాలాసోర్ తరహా ప్రమాదం జరుగుతుందని  ఇటీవలనే  దక్షిణ మధ్య రైల్వే శాఖకు బెదిరింపు లేఖ అందింది. ఈ ఏడాది జూన్  30న  రైల్వే శాఖకు ఈ లేఖ అందింది. ఈ లేఖ విషయమై నార్త్ జోన్  పోలీసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖాధికారులు  ఫిర్యాదు  చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  నార్త్ జోన్ పోలీసులు దర్యాప్తు  నిర్వహిస్తున్నారు. ఢిల్లీ - హైద్రాబాద్ మార్గంలో ఈ ప్రమాదం జరుగుతుందని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖ గురించి విచారణ చేస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి మూడు రోజుల క్రితం మీడియాకు  తెలిపారు. 


 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్