టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ: కోమటిరెడ్డి బ్రదర్స్‌ సహా సీనియర్లకు చోటు

By narsimha lodeFirst Published Sep 12, 2021, 4:20 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మరికొందరికి ఆ పార్టీ చోటు కల్పించింది. రాష్ట్రంలోని పార్టీ సీనియర్లకు ఈ కమిటీలో చోటు కల్పించింది కాంగ్రెస్ నాయకత్వం.పొలిటికల్ ఎఫైర్స్  కమిటీలో సీనియర్లు లేని లోటు కన్పిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెైస్ కమిటీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మరికొందరికి చోటు కల్పించింది ఎఐసీసీ.  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సీనియర్ల కొరత కన్పిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.,

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు గాను పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చర్చించనుంది. తాజాగా మరికొందరికి ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీలో 16 మంది సభ్యులతో  పాటు ముగ్గురిని కమిటీ ఛైర్మెన్లను నియమించారు. 

మాణికంఠాగూర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ గా కొనసాగుతారు.ఎ.రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి, ఎన్ . ఉత్తమ్ కుమార్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి,  శ్రీమతి రేణుకా చౌదవరి,పి. బలరామ్ నాయక్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క,  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎఐసీసీ ఆమోదం పొందిన  కమిటీల ఛైర్మెన్లు,ఎఐసీసీ సెక్రటరీలు, ఎఐసీసీ సెక్రటరీస్ ఇంచార్జీలకు కూడ ఈ కమిటీలో చోటు దక్కింది.గతంలో ఉన్న సభ్యులకు అదనంగా ఈ సభ్యులు ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ మేరకు ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.


 

click me!