ప్రాణంతీసిన మద్యం మత్తు... కన్న తండ్రిని కొట్టిచంపిన కొడుకు

Arun Kumar P   | Asianet News
Published : Aug 04, 2021, 12:57 PM IST
ప్రాణంతీసిన మద్యం మత్తు... కన్న తండ్రిని కొట్టిచంపిన కొడుకు

సారాంశం

మద్యం మహమ్మారి ఓ కుటుంబంలో చిచ్చుపెట్టి కన్న తండ్రినే కొడుకు కొట్టిచంపేలా చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. 

నాగర్ కర్నూల్: మద్యానికి బానిసై నిత్యం కుటుంబసభ్యులను వేధిస్తున్న తండ్రిని కన్న కొడుకే కొట్టిచంపాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా మద్యం మహమ్మారి కారణంగా కన్న కొడుకే తండ్రిని చంపే పరిస్థితి ఏర్పడింది.  

వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన పోడెళ్ల కురుమయ్య(48) మద్యానికి బానిసయ్యాడు. ప్రతి నిత్యం మద్యం మత్తులోనే వుండే అతడు కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అంతేకాదు మద్యానికి డబ్బుల కోసం నిత్యం కుటుంబసభ్యులను వేధించేవాడు. అతడి ఆగడాలను మరీ మితిమీరడంతో భార్యా పిల్లలు ఇక భరించలేకపోయారు. 

read more  తృటిలో తప్పిన ప్రమాదం:ఖైరతాబాద్‌ సిగ్నల్ వద్ద పోలీస్ వాహనంలో మంటలు

గురువారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కొమురయ్య కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. దీంతో సహనం కోల్పోయిన అతడి కొడుకు ఇనుపరాడ్ తో తండ్రిని కొట్టాడు. రాడ్ తో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొమురయ్య అక్కడికక్కడే చనిపోయాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తండ్రిని హతమార్చిన కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?