వెలిమినేడు రోడ్డు ప్రమాదంపై ట్విస్ట్: బస్సును మాయం చేసిన ట్రావెల్స్ యాజమాన్యం

By narsimha lodeFirst Published Aug 4, 2021, 12:35 PM IST
Highlights


ఓ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తెలివిగా వ్వహరించింది. పోలీసుల నిర్లక్ష్యం కూడ ఆ ట్రావెల్స్ యాజమాన్యానికి కలిసొచ్చింది. ప్రమాదం జరిగినా కూడ ప్రమాదమే జరగలేదని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం బుకాయిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సును కూడ ట్రావెల్స్ యాజమాన్యం మాయం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

చిట్యాల: ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకొంది. ప్రమాదానికి గురైన బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మాయం చేసింది.గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వెలిమినేడు వద్దకు రాగానే బ్రేక్ డౌన్ అయింది. ఈ బస్సులోని ప్రయాణీకులను మరో బస్సులో ఎక్కిస్తున్న సమయంలో ఈ బస్సుకు ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదఘటనపై చిట్యాల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై రెండు రోజుల క్రితం బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.అయితే బస్సుకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం బుకాయిస్తోంది.  ప్రమాదానికి  గురైన బస్సును ట్రావెల్స్ యాజమాన్యం మాయం చేసింది.  చిట్యాల పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకొందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
 

click me!