కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

By AN TeluguFirst Published Aug 4, 2021, 12:55 PM IST
Highlights

నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం జరిగిందని.. కాకతీయ యూనివర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.  తెలుగు యూనివర్సిటీ వీసీకి డెబ్భై ఏళ్ళు దాటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
హైదరాబాద్ : కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీసీల నియామకంపై విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 

నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం జరిగిందని.. కాకతీయ యూనివర్సిటీ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.  తెలుగు యూనివర్సిటీ వీసీకి డెబ్భై ఏళ్ళు దాటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, యుజీసీని ఆదేశించింది. అనంతరం కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్, తెలుగు వర్సిటీ వీసీ కిషన్రావుకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 27 కి వాయిదా వేసింది. 

click me!