తల్లిని గొడ్డలితో నరికి అతి దారుణంగా హత్య చేసిన కొడుకు.. అడ్డువచ్చిందనే...

By SumaBala Bukka  |  First Published Apr 8, 2023, 7:26 AM IST

డబ్బులివ్వలేదన్న కోపంతో తండ్రిమీద దాడిచేయబోయాడో కొడుకు. తల్లి అడ్డుపడింది. కోపావేషంలో తల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఆ కొడుకు. 
 


గద్వాల : తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో కన్నతల్లి అని కూడా చూడకుండా అతి దారుణంగా నరికి చంపాడు కొడుకు. ఆ తల్లి చేసిన నేరమల్లా తండ్రిపై దాడి చేయబోతుంటే ఆపడమే. దీంతో తీవ్ర కోపావేషంలో విచక్షణ మరిచి.. అదే గొడ్డలితో తల్లి తలపై మోది హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం లో వెలుగు చూసింది. హరిజన నాగమ్మ (60), రాముడు దంపతులు.  వీరు రామాపురంలో నివాసం ఉంటున్నారు. 

వీరికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు మొత్తం ఏడు మంది సంతానం. అందరికీ వివాహాలు చేశారు. ఎవరి సంసారాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. వీరిలో మూడో కొడుకు అయినా ప్రేమ్ రాజ్ ది ప్రేమపెళ్లి.  8 ఏళ్ల క్రితం హైదరాబాద్ చెందిన యువతిని పెళ్లి చేసుకుని.. నగరంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ప్రేమ్ రాజ్ రామాపురానికి వచ్చాడు. 10 రోజుల తర్వాత తిరిగి తన భార్య దగ్గరికి వెళతానని తల్లిదండ్రులకు చెప్పాడు. తనకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. తమ దగ్గర డబ్బు లేదని తల్లిదండ్రులు చెబుతున్నా వినిపించుకోలేదు. 

Latest Videos

తెలంగాణలో షాపులు, రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

వారి మీద కోపంతో శుక్రవారంనాడు ఇంటి ముందు ఉన్న చెట్టును.. ప్రేమ్ రాజ్ గొడ్డలితో నరకబోయాడు. దీనికి  ప్రేమ్ రాజ్ తండ్రి అడ్డు చెప్పాడు. దీంతో ప్రేమ్ రాజ్ అదే గుడ్డలితో తండ్రి మీద దాడికి దిగబోయాడు. అది గమనించిన తల్లి.. కొడుకుకు అడ్డు పడింది. దీంతో ప్రేమ్ రాజు కోపంతో ఊగిపోయాడు. తండ్రి మీద చేయాలనుకున్న దాడిని తల్లి మీద చేశాడు.  చేతిలోని గొడ్డలితో అడ్డువచ్చిన తల్లిని నాలుగు సార్లు కొట్టాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

నిందితుడు పారిపోకుండా గ్రామస్తులంతా కలిసి పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన అనంతరం.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతోనే తమ కొడుకైన ప్రేమ్ రాజ్ ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడని  తండ్రి  రాముడు  కన్నీటి పర్యంతమవుతున్నాడు. 
 

click me!