తల్లిని చంపి.. తల పట్టుకుని తిరుగుతూ.. ఓ కొడుకు ఘాతుకం..

Published : Feb 10, 2023, 07:55 AM IST
తల్లిని చంపి.. తల పట్టుకుని తిరుగుతూ.. ఓ కొడుకు ఘాతుకం..

సారాంశం

ఆస్తికోసం అత్యంత దారుణానికి తెగించాడో కొడుకు. తనకు భూమి రాసివ్వడం లేదని తల్లిని కిరాతకంగా హత్య చేసి.. తల చేత్తో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. 

జనగామ : ఆస్తికోసం కన్నతల్లిమీదే దాష్టీకానికి దిగాడో కొడుకు. నవమాసాలు మోసి, కనీపెంచిన తల్లి అని కూడా చూడకుండా హత్య చేసి.. తల,మొండెం వేరు చేశాడు. ఆ తరువాత తలను పట్టుకుని తిరుగుతూ భయోత్పాతాన్ని కలిగించాడు. రెండెకరాల భూమికోసం తల్లిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపింది. 

తెలంగాణలోని జనగామ జిల్లాలో  దారుణమైన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడు ఓ కొడుకు. తాను అడిగిన భూమిని తనకు ఇవ్వలేదన్న కక్షతో తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. మెడ నరికేశాడు. ఈ దారుణమైన ఘటన గురువారం జనగామ జిల్లా మరిగడిలో చోటు చేసుకుంది. దీనిమీద మరిగడి స్థానికులు, జనగామ సిఐఎల్లబోయిన  శ్రీనివాస్ యాదవ్ వివరాలను ఈ మేరకు తెలియజేశారు. కూరాకుల రమణమ్మ (65) మరిగడి నివాసి. ఆమెకు ఇద్దరు సంతానం. కొడుకు కన్నప్ప, కూతురు లావణ్య. కొడుకు, కూతురు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. రమణమ్మ భర్త రాజయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. 

తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

కన్నప్పకు భార్య, కుమార్తె ఉన్నారు. ఇక కుమార్తె లావణ్య భర్తతో విభేదాల కారణంగా తల్లి దగ్గరే ఉంటుంది. ఇదిలా ఉండగా రమణమ్మ పేరిట పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆమె కొడుకుకు రెండు ఎకరాలు.. కూతురుకు నాలుగెకరాల భూమి రాసిచ్చింది. అయితే కూతురుకు ఇచ్చినట్లే తనకు కూడా మరో రెండు ఎకరాల భూమి రాసి ఇవ్వాలని కన్నప్ప చాలా రోజుల నుంచి తల్లిని అడుగుతున్నాడు. అయినా ఆమె వినడం లేదు. ఇటీవల ఓ రోజు ఇదే వాదనలో కోపంతో కన్నప్ప తల్లిని గోడకేసి కొట్టాడు. 

దీంతో గాయపడిన ఆమె  కన్నప్ప మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది తట్టుకోలేక, మనస్తాపంతో కన్నప్ప రెండు రోజుల క్రితం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని జనగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకొని కన్నప్ప గురువారం ఇంటికి తిరిగివచ్చాడు. రాగానే అతనికి తల్లి మీద కోపం కట్టలు తెంచుకుంది. కత్తి తీసుకుని ఆమె మీద దాడికి దిగాడు. 

మెడ మీద అతికిరాతకంగా నరికేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  కత్తి దాడిలో ఆమె తల, మొండెం వేరైంది. రక్తం దారాలు కట్టింది. తల్లిని హత్య చేసిన తర్వాత కన్నప్ప కోపం ఇంకా తీరలేదు. ఆమె తలను చేత్తో పట్టుకుని.. కొద్దిసేపటి వరకు ఇంటి చుట్టుపక్కల తిరిగాడు. అది గమనించిన స్థానికులు భయాందోళనలు చెందారు. తర్వాత తలను అలాగే పట్టుకొని జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu