అత్తామామలకు కరెంట్ షాక్ పెట్టి చంపాలని అల్లుడి స్కెచ్.. కారణం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

Published : Apr 25, 2023, 03:00 PM IST
అత్తామామలకు కరెంట్ షాక్ పెట్టి చంపాలని అల్లుడి స్కెచ్.. కారణం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

సారాంశం

మందలించలేదని అత్తామామల్ని హత్య చేయడానికి ప్లాన్ చేశాడో అల్లుడు. కరెంట్ షాక్ ఇచ్చి చంపాలని చూశాడు. కానీ ప్లాన్ బెడిసికొట్టి, దొరికిపోయాడు.  

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు పిల్లనిచ్చిన అత్తమామలను కరెంట్ షాక్ పెట్టి చంపాలని చూశాడు అల్లుడు. దీనికోసం కరెంట్ షాక్ స్కెచ్ వేశాడు.  కానీ ఆ కుట్ర బయటపడడంతో జైలు పాలయ్యాడు. ఇంతకీ పిల్లనిచ్చి పెళ్లి చేసిన అత్తమామల్ని చంపాలని ఎందుకు ప్లాన్ చేశాడని కారణం కనుక్కున్న పోలీసులు.. అతను చెప్పింది విన్న స్థానికులు షాక్ అయ్యారు. 

సంగారెడ్డిలో ఉండే రమేష్ అనే వ్యక్తి తన అత్తమామలను హత్య చేయడానికి ప్లాన్ వేశాడు. చివరికి అది బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. ఏప్రిల్ 12వ తేదీన వారిని చంపాలని ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. కానీ, అతని ఐడియా బెడిసి కొట్టింది. కరెంట్  కనెక్షన్ ఇచ్చిన ఇంటి తలుపులు అత్తమామలు తీస్తారనుకుంటే.. తల్లి కూతుర్లు ఆ తలుపులు ముట్టుకున్నారు. దీంతో కరెంట్ షాక్ కొట్టింది.  విలవిల్లాడుతూ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. కరెంటు ప్రసరణ నిలిపివేశారు. 

మెదడు లేని బంటి.. పార్టీలు మారే చంటి : రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై కేటీఆర్ సెటైర్లు

దీంతో ప్రాణాపాయం తప్పింది. ఇది మామూలు విషయం కాకపోవడంతో.. అనుమానాస్పదంగా ఉండడంతో..  బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసుకుని.. విచారణ చేపట్టగా  తమ బిడ్డనిచ్చిన అల్లుడు రమేషే ఈ ఘటనలో కుట్ర దారుడిగా తేలింది. దీంతో పోలీసులు, కుటుంబ  సభ్యులు షాక్ అయ్యారు. అయితే, అత్తామామలను రమేష్ ఎందుకు చంపాలని ప్రయత్నించాడటా అంటే.. 

రమేష్ ఓసారి అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు.. వారు అతడిని సరిగ్గా మందలించలేదట. తనను సరిగా పలకరించలేదన్న కోపాన్ని మనసులో పెట్టుకొని రగిలిపోయాడు రమేష్. అంతే, తనకు ఇంత అవమానం చేసిన అత్తమామల్ని వదల దలుచుకోలేదు. ఇలాగైనా వారిని చంపాలనుకున్నాడు. కానీ, హత్యా నేరంతో జీవితాన్ని పాడు చేసుకోవాలనుకోలేదు. అందుకే కరెంట్ షాక్ తో చంపేస్తే తన మీదికి రాదని ఫిక్స్ అయ్యి.. అలా చేశానని పోలీసుల విచారణలో తెలిపాడు.  ఇది విన్న వారంతా ఆశ్చర్యంతో నూరేళ్లపెట్టారు. ప్రస్తుతం అల్లుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu